close
Published : 09/04/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్యాస్టింగ్‌ కౌచ్‌పై సీనియర్‌ నటి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలోని క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి సీనియర్‌ నటి అన్నపూర్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు అనేది ఎప్పుడూ ఒకరి వైపే ఉండదని.. ఇద్దరికీ ఇష్టమైతేనే కొన్ని తప్పులు జరుగుతాయని ఆమె అన్నారు. నటిగా, కథానాయికగా, సహాయనటిగా ప్రేక్షకులకు చేరువైన అన్నపూర్ణ ప్రస్తుతం ‘ఎఫ్‌-3’లో నటిస్తున్నారు. తాజాగా ఆమె తన కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘నాటకాల నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాను. కెరీర్‌ ఆరంభంలోనే నా పేరును ఉమా నుంచి అన్నపూర్ణగా మార్చుకున్నాను. నటిగా, కథానాయికగా.. ముఖ్యంగా పలువురు నటీనటులకు తల్లి పాత్రలో నటించాను. నేను కలిసి పనిచేసిన నటీనటులందరూ నన్ను గౌరవించారు.’ అని అన్నపూర్ణ తెలిపారు.

అనంతరం క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి స్పందిస్తూ.. ‘క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది అనవసరపు వ్యవహారం. ప్రతిరంగంలోనూ మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటున్నారు. కానీ ఇళ్లు, కుటుంబం, గౌరవం అనే వాటిని దృష్టిలో ఉంచుకుని వేటికి లొంగకుండా మహిళలు తప్పించుకు వచ్చేస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడివాళ్లు కూడా తప్పించుకుపోవాలి. క్యాస్టింగ్‌ కౌచ్‌ అంటే రెండు వైపులా ఆలోచించాలి. ఒకవేళ అలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే నోరు విప్పాలి. తప్పులు జరగవని నేను చెప్పను. ఇద్దరికీ ఇష్టమైతేనే కొన్ని తప్పులు జరుగుతాయ్‌. అలాగే, అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లకి కష్టాలు ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొవాలి.’’ అని అన్నపూర్ణ అన్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని