మార్చి 15 నుంచి ‘అన్నాత్తే’ షూట్‌! - annatte will be shooting again from march 15!
close
Published : 26/02/2021 14:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్చి 15 నుంచి ‘అన్నాత్తే’ షూట్‌!

ఇంటర్నెట్‌ డెస్క్: రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. గత డిసెంబరులో రజనీకాంత్‌ అస్వస్థతకు గురవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని, వైద్యుల సూచన మేరకు రజనీ విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని త్వరలోనే సినిమా షూటింగ్‌ని తిరిగి ప్రారంభించుకోవచ్చని నిర్మాతలకు చెప్పారట రజనీ. దాంతో చిత్ర నిర్మాణ సంస్థ షూటింగ్‌ని మార్చి 15న తిరిగి ప్రారంభించడానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌ని చెన్నై లేదా హైదరాబాద్‌లో నిర్వహిస్తారనే విషయంపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఇందులో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ,  ప్రకాష్ రాజ్, రోబో శంకర్‌ తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీత స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా నవంబర్‌ 4, 2021 దీపావళికి ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని