కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి - another MLA dies of Covid 19 second in Trinamool congress
close
Published : 17/08/2020 18:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి

కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమాల్‌ కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే కరోనాతో మృతిచెందారు. సమరేశ్‌ దాస్‌ (74)కు జులై 18న కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో సాల్ట్‌ లేక్‌ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో చేరారు. దాదాపు నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా సోకి మృతిచెందిన రెండో ఎమ్మెల్యే సమరేశ్‌ దాస్‌. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తమొనాష్‌ ఘోష్‌ (60) వైరస్‌ సోకి జూన్‌లో మృత్యువాత పడ్డారు. బెంగాల్‌లో ఇప్పటివరకు 1.16 లక్షల కేసులు నమోదయ్యాయి. 2,428 మంది మరణించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని