‘Indian 2’ వివాదంలో మరో మలుపు - another twist in indian2 issue
close
Updated : 15/05/2021 12:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘Indian 2’ వివాదంలో మరో మలుపు

కమల్‌హాసన్, శంకర్‌ కలయికలో తెరకెక్కుతోన్న ‘ఇండియన్‌ 2’ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాకే శంకర్‌ తన కొత్త సినిమాను మొదలుపెట్టాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. సామరస్యంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఈ కేసు జూన్‌కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో లైకా ప్రొడక్షన్‌ మరో అడుగు ముందుకేసినట్టు సమాచారం. ‘ఇండియన్‌ 2’ని పూర్తి చేసే  వరకు శంకర్‌ కొత్త చిత్రం మొదలుపెట్టకుండా చూడాలని తెలుగు, హిందీ ఫిల్మ్‌ఛాంబర్స్‌కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఓ పాన్‌ ఇండియా చిత్రంతో పాటు ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌ని రణ్‌వీర్‌సింగ్‌తో తెరకెక్కించనున్నట్లు శంకర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తర్వాతే ‘ఇండియన్‌ 2’ వివాదం మరింత ముదిరింది. ఇదేనిజమైతే... రామ్‌చరణ్‌ శంకర్‌ కలయికలో సినిమా ఆలస్యమయ్యే అవకాశముంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని