కరోనా.. సినిమా.. ఐదుగురు దర్శకులు! - anubhav sinha making a film with four filmmakers collaboration
close
Published : 30/07/2020 02:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా.. సినిమా.. ఐదుగురు దర్శకులు!

కరోనా సంక్షోభమే నేపథ్యం

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ సిన్హాకు సామాజిక చిత్రాలు తీస్తారనే పేరుంది. ‘గులాబ్‌ గ్యాంగ్‌’, ‘ఆర్టికల్‌ 15’ ఇటీవల ‘థప్పడ్‌’ చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా అనురాగ్‌ తదుపరి ప్రాజెక్టుగా కరోనా సంక్షోభంలో ఎదుర్కొంటున్న సమస్యలతో ఓ సినిమా చేయబోతున్నారట. విశేషమేమిటంటే ఈ సినిమాను తనే నిర్మాతగా వ్యవహరిస్తూ మరో నలుగురు దర్శకులతో కలిసి తెరకెక్కిస్తారట.

దివంగత నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌కు అనురాగ్‌ సిన్హా మంచి స్నేహితుడు. ఇటీవల ఆయన చనిపోతే.. కరోనా నిబంధన వల్ల అంతిమ సంస్కారాల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందట. అలాగే తన స్నేహితులైన కొందరు కరోనా మహమ్మారి.. కరోనా నిబంధనల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారట. దీంతో నిజజీవితంలో ఎదురైన కొన్ని సమస్యలను కథగా మార్చి సినిమా చేయాలని అనురాగ్‌ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దర్శకులు సుధీర్‌ మిశ్రా, హన్సాల్‌ మెహతా, కేతన్‌ మెహతా, సుభాష్‌ కపూర్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. 

‘‘దర్శకులు వేరే కథలను ఎందుకు ఎంచుకోవడం? కరోనా సమయంలోనే దర్శకుడు సుధీర్‌ వాళ్ల నాన్న చనిపోయారు. అతడి కార్‌ డ్రైవర్‌కి కరోనా వస్తే ఆస్పత్రిలో బెడ్‌ దొరకలేదు. ఇర్ఫాన్‌ ఖాన్‌ను కోల్పోయాం. తింగ్మాశు.. ఇర్ఫాన్‌ అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు పోలీసులతో గొడవ పడ్డాడు. దర్శకులు సుభాష్‌, హన్సాల్‌, కేతన్‌ జీవితంలోనూ కరోనా వల్ల ఇబ్బందులు పడ్డ ఘటనలు ఉన్నాయి. వీటిని కలిపి ఓ సినిమా చేయాలన్న నా ఆలోచనను వారికి చెప్పాను. వాళ్లూ ఒప్పుకున్నారు. దీంతో సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాం. దేశంలో కరోనా మొదలైన ఫిబ్రవరి, మార్చి నెలల నుంచి కథ మొదలవుతుంది’’అని అనుభవ్‌ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని