ఉత్కంఠ‌ భ‌రితంగా ‘అనుకోని అతిథి’ టీజ‌ర్‌ - anukoni athidi teaser
close
Published : 22/05/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్కంఠ‌ భ‌రితంగా ‘అనుకోని అతిథి’ టీజ‌ర్‌

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి జంటగా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అతిరన్‌’. 2019లో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేసిన ఈ సినిమా త్వ‌ర‌లో డిజిట‌ల్ మాధ్య‌మంలో సంద‌డి చేయ‌నుంది. తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో ప్ర‌ముఖ ఓటీటీ ఆహాలో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో టీజ‌ర్ విడుద‌లైంది. ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతూ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. సాయి ప‌ల్ల‌వి హావ‌భావాలు ఆక‌ట్టుకుంటున్నాయి. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వివేక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.
 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని