sai pallavi: ‘అనుకోని అతిథి’ ట్రైల‌ర్! - anukoni athidi trailer
close
Updated : 25/05/2021 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

sai pallavi: ‘అనుకోని అతిథి’ ట్రైల‌ర్!

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఇప్ప‌టికే ఎన్నో థ్రిల్ల‌ర్ సినిమాల్ని అందించిన ప్ర‌ముఖ ఓటీటీ ఆహా ఆద్యంతం ఉత్కంఠ పెంచే మ‌రో చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుంది.  ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి జంటగా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అతిరన్‌’ని తెలుగులో  ‘అనుకోని అతిథి’ పేరుతో అందుబాటులోకి తీసుకురానుంది. మే 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో కొత్త ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. ఇందులోని  ప్ర‌తి స‌న్నివేశం ఉత్కంఠ పెంచుతోంది. ఓ బంగ్లా నేప‌థ్యంలో వ‌చ్చే  ‘బ‌య‌ట వాళ్ల‌కి ఇక్క‌డ ఏం ప‌ని? ఇక్క‌డ ఎవ‌ర్నీ న‌మ్మ‌కూడ‌దు’ అనే సంభాష‌ణ‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. సాయి ప‌ల్ల‌వి నట‌న ప్ర‌తి ఒక్కరినీ క‌ట్టిప‌డేస్తోంది. జిబ్రాన్ అందించిన నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన బ‌లంగా నిలుస్తోంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వివేక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించారు. 2019లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఈ చిత్రంపై విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌లు కురిపించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని