అన్నీ రుచి చూసేదాన్ని - anupama parameswaran diet
close
Published : 04/09/2020 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నీ రుచి చూసేదాన్ని

హైదరాబాద్‌: మలయాళంతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్‌. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లకు విరామం దొరకడంతో ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేసింది మలయాళ కుట్టి. ఈ సందర్భంగా  కరోనా పరిస్థితుల నేపథ్యంలో మీరు తీసుకునే డైట్‌లో ప్రత్యేకంగా ఏమన్నా మార్పులు చేసుకున్నారా? అని అనుపమను ప్రశ్నిస్తే ఏం చెప్పిందో తెలుసా?

‘‘ప్రత్యేకంగా అంటూ ఏమీ లేవు. నేను ముందు నుంచీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేదాన్ని. ఇప్పుడీ  పరిస్థితులు చూశాక మరింత జాగ్రత్తగా ఉంటున్నా అంతే. ఇప్పుడనే కాదు.. గతంలోనూ నేను జంక్‌ ఫుడ్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్, సాఫ్ట్‌ డ్రింక్స్‌ జోలికి వెళ్లే దాన్ని కాదు. మిగతా అన్నీ రుచి చూసేదాన్ని. తెలుగు వంటల్ని బాగా ఇష్టపడతా. అన్నం, పప్పు, పెరుగుతో మూడు పూటలా భోజనం పెట్టినా చక్కగా లాగించేస్తా. ఉదయం అల్పాహారాలు మొదలుకొని అన్నీ బాగా ఆస్వాదిస్తుంటా. అయితే ఈ మధ్య కాలంలో ఇంటికే పరిమితమయ్యా. బయట ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉన్నట్లే’’ అని చెప్పుకొచ్చింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని