నా జీవితంలోని ఇద్ద‌రు ఉత్త‌మ‌ పురుషులు - anushka sharma post about fathersday virat kohli ajay kumar sharma
close
Published : 21/06/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా జీవితంలోని ఇద్ద‌రు ఉత్త‌మ‌ పురుషులు

 అనుష్క‌శ‌ర్మ‌

ఇంట‌ర్నెట్ డెస్క్‌: మ‌నలో చాలామంది మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మాతృమూర్తికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసి, వారి సేవ‌ల్ని గుర్తుచేసుకుంటాం. ఫాద‌ర్స్‌డే వ‌స్తే నాన్న జ్ఞాప‌కాల్లో మునిగిపోతాం. కానీ, కొంత‌మంది మాత్రం నాన్న‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న భ‌ర్త‌పై ప్రేమ‌నీ చాటుకుంటారు. ఎందుకంటే భ‌ర్త.. త‌న బిడ్డ‌కు తండ్రి క‌నుక‌. ఫాదర్స్‌డే సంద‌ర్భంగా త‌న తండ్రి, త‌న భ‌ర్త‌పై అలాంటి అసాధార‌ణ ప్రేమే చూపించింది బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా త‌న నాన్న‌ అజ‌య్ కుమార్ శ‌ర్మ‌, భ‌ర్త‌ విరాట్ కోహ్లితో దిగిన అపురూప‌మైన ఫొటోల్ని పంచుకుంటూ వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ‘‘నా జీవితంలోని ఇద్ద‌రు ఉత్త‌మ‌ పురుషులు. వీళ్ల ప్రేమ‌తో జీవిత‌మంతా సంతోష‌మే. ది బెస్ట్ ఫాద‌ర్స్‌’’ అని పేర్కొంది. ఈ పోస్ట్ చూసిన సినీ, క్రికెట్ తార‌ల‌తోపాటు నెటిజ‌న్లు సైతం అనుష్క శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 2017లో ఒక్క‌టైన విరుష్క జోడీ ఏడాది జ‌న‌వ‌రి 11న పండంటి పాప‌కి జ‌న్మనిచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌మ ముద్దుల త‌న‌య‌కి వామికా అనే పెట్టారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని