అనుష్కశర్మ మెచ్చిన అభిమాని ఎవరో తెలుసా..? - anushka sharma shares photos with her fan virat kohli
close
Published : 17/07/2021 22:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుష్కశర్మ మెచ్చిన అభిమాని ఎవరో తెలుసా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ అభిమాని కోసం ఏదైనా చేసేందుకు సిద్ధం అంటోంది బాలీవుడ్‌ నటి, భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ. ఇంతకీ ఆ అభిమాని ఎవరో తెలుసా..? ఇంకెవరు విరాట్‌కోహ్లీనే. తన భర్త కోహ్లీని ఉద్దేశిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేసిందామె. ఆ పోస్టులో ఆమె కొన్ని ఫొటోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ జంట ఇంగ్లాండ్‌లో విహరిస్తోంది. భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లాండ్‌ జట్టుతో సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలోనే విరాట్‌కోహ్లీ తన కుటుంబాన్ని కూడా ఇంగ్లాండ్‌కు తీసుకెళ్లాడు. సిరీస్‌ ప్రారంభం కావడానికి ఇంకా కొంత సమయం ఉంది. దీంతో దొరికిన విరామ సమయంలో ఈ జంట ఇంగ్లాండ్‌ వీధుల్లో హాయిగా విహరిస్తోంది.

‘‘వీధుల్లో సరదాగా విహరిస్తుండగా ఓ అభిమాని నన్ను గుర్తు పట్టాడు. ఈక్రమంలోనే నేను ఫొటోలకు పోజులిచ్చాను. దాంతో అతను ఎంతో సంతోష పడ్డాడు. నా అభిమానుల కోసం ఏదైనా చేస్తా’’ అంటూ అనుష్క ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా.. అనుష్కశర్మ తర్వాతి సినిమా కోసం క్రికెటర్‌ అవతారం ఎత్తనుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత మహిళా క్రికెటర్‌ జులాన్ గోస్వామి బయోపిక్‌లో ఆమె నటించనున్నట్లు బీటౌన్లో చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆమె చివరిసారిగా 2018లో వచ్చిన ‘జీరో’ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె ‘పాతాళ్‌ లోక్’, ‘బుల్బుల్’ వంటి ఓటీటీ ప్రాజెక్టులను నిర్మించింది.


 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని