close
Published : 25/02/2021 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్చి 15న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అప్‌డేట్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్.ఆర్‌.ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తుండగా, కొమరం భీం పాత్రను ఎన్టీఆర్‌ పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన టీజర్స్ విడుదలై అభిమానులను అలరించాయి. చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తోంది. ఆమె పుట్టినరోజు మార్చి 15. ఈ సందర్భంగా అలియాకు సంబంధించి ఏమైనా కొత్త అప్‌డేట్‌ని ‘ఆర్.‌ఆర్‌.‌ఆర్’‌ చిత్రబృందం విడుదల చేస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. ఐరిష్ నటి ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్‌ సరసన నటిస్తోంది. ఆ మధ్య ఒలీవియా పుట్టినరోజు సందర్భంగా మోరిస్ ఫస్ట్ లుక్‌ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్నారు.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని