ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కి కరోనా పాజిటివ్‌ - ap assembly deputy speaker kona raghupathi have corona
close
Published : 03/08/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కి కరోనా పాజిటివ్‌

వీడియో ద్వారా వెల్లడించిన కోన రఘుపతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో‌ కరోనా వ్యాప్తి  కొనసాగుతోంది. సాధారణ పౌరుడి నుంచి ప్రముఖుల వరకు కరోనా బారిన పడ్డవారే. నిన్న కరోనాతో మాజీమంత్రి , భాజపా నేత పైడికొండల మాణిక్యాల రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఏపీలోని పలువురు అధికార పార్టీ నాయకులకు కరోనా సోకింది. తాజాగా శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. పాజిటివ్‌ వచ్చినట్లు కోన రఘుపతి వీడియో ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ బాధపడవద్దని సూచించారు. వైద్యుల సూచన మేరకు వారం పాటు హోంక్వారంటైన్‌లో ఉంటానని పేర్కొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని