AP News: పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: జగన్‌ - ap cm jagan comments
close
Updated : 15/06/2021 14:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: జగన్‌

వాహ‌న‌మిత్ర ద‌ర‌ఖాస్తుకు గ‌డువు పెంపు

మూడో ఏడాది సాయం విడుద‌ల చేసిన సీఎం

అమ‌రావ‌తి: వైఎస్ఆర్ వాహ‌న మిత్ర ప‌థ‌కంలో 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల ప్ర‌జ‌లే ల‌బ్ధి పొందుతున్నార‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. వారంద‌రి బ‌తుకులు మార్చేందుకు ఏటా ఆర్థిక సాయం చేస్తున్న‌ట్లు తెలిపారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో వాహ‌న మిత్ర ప‌థ‌కానికి సంబంధించి మూడో ఏడాది సాయాన్ని విడుద‌ల చేసిన ఆయ‌న మాట్లాడారు. ఈ ప‌థకం ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు రూ.10 వేల చొప్పున సాయం అంద‌జేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో 2,48,468 మంది ల‌బ్ధిదారుల‌కు రూ.248.47 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేస్తున్న‌ట్లు వివ‌రించారు. 

ల‌బ్ధిదారుల ఎంపిక పార‌దర్శ‌కంగా సాగుతోంద‌న్న జ‌గ‌న్.. అర్హులైన వారంద‌రూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మ‌రో నెల రోజులు గ‌డువు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2018లో ఏలూరు స‌భ‌లో ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి ఆర్థిక సాయం చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ ప‌థ‌కానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు రూ.759 కోట్ల సాయం విడుద‌ల చేశామ‌న్నారు. ఫిర్యాదులు, సందేహాలు ఉంటే 1902 టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ను సంప్ర‌దించాల‌ని జ‌గ‌న్ సూచించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని