2023 నాటికి అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌: జగన్‌ - ap cm jagan review meet on internet connections
close
Published : 26/04/2021 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2023 నాటికి అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌: జగన్‌

అమరావతి: అన్ని గ్రామాల్లో సదుపాయాలతో కూడిన డిజిటల్‌ లైబ్రరీలు ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. సొంత ఊళ్లలోనే వర్క్‌ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తామని, నిర్ణీత వ్యవధిలో ఈ పనులన్నీ పూర్తి కావాలని సీఎం అన్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌, అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ పంపిణీ అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. 2023 మార్చి నాటికి గ్రామాల్లో అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలన్నారు. ఏస్పీడ్‌ కనెక్షన్‌ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

‘‘వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఉండాలి. రాష్ట్రంలోని తుపాను ప్రభావిత 108 గ్రామాల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయాలి. వచ్చే ఏడాది జనవరి 9న అమ్మఒడి పథకం అమలు చేస్తాం. ల్యాప్‌టాప్‌లు కోరుకున్న వారికి అదే రోజున వాటిని అందజేయాలి. 9 నుంచి 12వ తరగతి వరకు గల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ ఆప్షన్‌ ఉంది. ల్యాప్‌టాప్‌ సర్వీసు కూడా పక్కాగా ఉండాలి. అవి చెడిపోతే గ్రామ సచివాలయంలో ఇవ్వాలి. సర్వీస్‌ సెంటర్‌కు పంపి వారంలో ల్యాప్‌టాప్‌ తిరిగి తెప్పించాలి. బిల్‌ ఫైనల్‌ చేసేటప్పుడు గ్యారెంటీ, వారంటీ, సర్వీస్‌పై దృష్టి పెట్టాలి. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ల్యాప్‌టాప్‌ సర్వీస్‌ సెంటర్లు ఉండాలి’’ అని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని