ఆసుపత్రుల్లో పడకల వివరాలు వెల్లడించాలి: జగన్ - ap cm jagan review on covid
close
Updated : 31/07/2020 14:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రుల్లో పడకల వివరాలు వెల్లడించాలి: జగన్

అమరావతి: కొవిడ్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతి జిల్లాలో కొవిడ్‌ ఆసుపత్రుల్లో పడకల ఖాళీలు, భర్తీ వివరాలు ప్రదర్శించాలని సూచించారు.

‘‘ఆసుపత్రి హెల్ప్‌లైన్‌ నంబర్‌ సహా పడకల ఖాళీ వివరాలు బ్లాక్‌బోర్డుపై రాయాలి. ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేదంటే సమీప ఆసుపత్రిలో బెడ్‌ కేటాయించాలి. రోగులకు ఆసుపత్రిలో బెడ్‌ దొరకలేదనే పరిస్థితి ఉండకూడదు. హెల్ప్‌ డెస్క్‌లో ఆరోగ్య మిత్రలను ఉంచాలి. కొవిడ్‌ కోసం నిర్దేశించిన 138 ఆసుపత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టండి. సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. హెల్ప్‌ డెస్క్‌ ప్రభావవంతంగా పనిచేస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. బెడ్లు, ఆహారం, శానిటైజేషన్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. జీజీహెచ్‌ లాంటి ఆసుపత్రులు మరింత దృష్టి పెట్టాలి. దీనిపై సంయుక్త కలెక్టర్లు దృష్టి పెట్టాలి.కొవిడ్‌పై అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచారం చేపట్టండి’’ అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని