‘కొవిడ్‌ ఆస్పత్రుల సేవలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి’ - ap cm review meeting on corona
close
Published : 07/08/2020 15:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కొవిడ్‌ ఆస్పత్రుల సేవలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి’

ఏపీ సీఎం జగన్‌

కరోనా నివారణ చర్యలపై సమీక్ష

అమరావతి: కొవిడ్‌ ఆస్పత్రుల సేవలపై బాధితుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యలపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. 104, 14410 కాల్‌ సెంటర్లు బాగా పనిచేయాలన్నారు. నంబర్ల పనితీరును అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. కాల్‌సెంటర్‌ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రులు, కొవిడ్‌ కేంద్రాల్లో ఆహారం, పారిశుద్ధ్యంపై సీఎం ఆరా తీశారు. ఆహారం మెనూ కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. టెలీమెడిసిన్‌ కింద మందులు తీసుకున్నవారి పరిస్థితి తెలుసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని