AP Corona: 24 వేలు దాటిన కేసులు - ap corona latest update
close
Updated : 16/05/2021 20:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP Corona: 24 వేలు దాటిన కేసులు

అమరావతి: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 94,550 నమూనాలను పరీక్షించగా... 24,171 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. తాజాగా  101 ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 9,372కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,10,436 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.

అనంతపురం జిల్లాలో 14 మంది, విశాఖలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో 9 మంది, నెల్లూరులో ఏడుగురు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు ,కడప జిల్లాలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.  గడిచిన 24 గంటల్లో 21,101 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,79,75,305 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని