‘ప్రభుత్వ వైద్యం సకాలంలో అందట్లేదు’ - ap corona situations report relased
close
Published : 13/08/2020 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రభుత్వ వైద్యం సకాలంలో అందట్లేదు’

ఏపీ పట్టణ పౌర సమాఖ్య సర్వే నివేదికలో వెల్లడి

అమరావతి: రోజువారి కరోనా కేసులు, డబ్లింగ్‌లో ప్రమాదకరస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ఉందని పట్టణ పౌర సమాఖ్య సర్వే వెల్లడించింది. 13 జిల్లాలు, 52 పట్టణాలు, నగరాల్లో ఏపీ పట్టణ పౌర సమాఖ్య సర్వే చేసి రూపొందించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 520 కరోనా రోగులను, కుటుంబసభ్యులను.. ఇతర వ్యాధులున్న 720 మంది రోగులను ఈ సమాఖ్య సర్వే చేసింది. ఈ వివరాలను విజయవాడలో పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌ బాబురావు విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. కరోనా కేసుల్లో రాష్ట్రం మూడోస్థానంలో ఉందని, ప్రభుత్వ వైద్యం ప్రజలకు సకాలంలో అందట్లేదని బాబురావు తెలిపారు. అరగంటలో బెడ్‌ అందిస్తామని సీఎం ఇచ్చిన హామీ అమలు కావట్లేదన్నారు. 

‘‘పడకల సంఖ్యపై చెప్పే మాటలకు, ఆచరణకు పొంతన లేదు. కరోనా పరీక్షల ఫలితాల కోసం రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి ఉంది. కొన్ని ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో ఇచ్చే ఆహారంలో నాణ్యత లోపించింది. ఆహారం బాగాలేదని రోగులు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం బాధాకరం. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తామన్నారు. ఈ మేరకు ఇచ్చిన జీవో77 నెల దాటినా అమలు కావట్లేదు. రూ.4వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, వైద్యం పేరుతో రూ.5,400కోట్ల భారం ప్రజలపై పడింది. ప్రభుత్వ ఖర్చుకంటే ప్రజలు చేసిందే ఎక్కువని సర్వేలో తేలింది. కార్పొరేట్‌ ఆస్పత్రిలో రోజుకు రూ. 30వేల నుంచి 75వేల వరకు వసూళ్లు చేస్తున్నారు’’అని పట్టణ పౌర సమాఖ్య తమ నివేదికలో వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని