ఏపీలో కరోనా: 7,822 కొత్త కేసులు - ap corona update
close
Updated : 03/08/2020 19:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో కరోనా: 7,822 కొత్త కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో(9am-9am)కొత్తగా 7,822 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో  మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,586కి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,113 కేసులు, విశాఖపట్నం జిల్లా నుంచి 1,049 కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు 21,10,923 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒక్క రోజులో 45,516 పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 76,377 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 88,672 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులోనే 5,786 మంది కోలుకున్నారు. తాజాగా 63 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,537కి చేరింది. 

పశ్చిమ గోదావరి జిల్లాలో పదకొండు మంది, విశాఖపట్నం జిల్లాలో తొమ్మిది మంది, ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది, నెల్లూరు.. శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, విజయ నగరం జిల్లాలో నలుగురు, చిత్తూరు.. కృష్ణా.. కర్నూలు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం.. తూర్పు గోదావరి.. గుంటూరు.. కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనాతో మృత్యువాత పడ్డారు. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలివీ..



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని