2 లక్షలకు చేరువలో ఏపీ కరోనా కేసులు - ap corona update
close
Updated : 06/08/2020 19:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2 లక్షలకు చేరువలో ఏపీ కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 2 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 63,686 నమూనాలను పరీక్షించగా.. 10,328 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1,96,789కి చేరాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,351 కేసులు, కర్నూలు జిల్లా నుంచి 1,285 కేసులు, అనంతపురం జిల్లా నుంచి 1,112 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 82,166 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,12,870 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 8,516 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,99,332 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా కరోనాతో 72 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,753కి చేరింది.

అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో పది మంది; గుంటూరు జిల్లాలో తొమ్మిది మంది; చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది; ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు; విశాఖపట్నం జిల్లాలో నలుగురు; కడప, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు; కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని