ఏపీ: కొత్తగా 7,665 కరోనా కేసులు - ap corona update
close
Published : 10/08/2020 19:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ: కొత్తగా 7,665 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో(9AM-9AM)రాష్ట్రంలో కొత్తగా 46,999 నమూనాలు పరీక్షిస్తే.. 7,665 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,35,525కి చేరింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,235 కేసులు, కర్నూల్‌ నుంచి 883 కేసులు వచ్చాయి. ఒక్క రోజులో 6,924 మంది కోలుకోగా.. మొత్తంగా 1,45,636 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,773 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 25,34,304 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.

తాజాగా కరోనాతో 80 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో పదకొండు; గుంటూరు జిల్లాలో పది; పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది; కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు; చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఆరుగురు; అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు; తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి  వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 2,116కి చేరింది. జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలివీ..

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని