9,996 కొత్త కరోనా కేసులు @ ఏపీ - ap corona update
close
Updated : 13/08/2020 17:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

9,996 కొత్త కరోనా కేసులు @ ఏపీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24గంటల్లో (9am-9am)కొత్తగా 9,996 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 55,692 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,64,142 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 90,840 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,70,924 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులోనే 9,499 మంది కోలుకున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 27,05,459 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 1,504 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

రాష్ట్రంలో తాజాగా కరోనా బారిన పడి మరో 82 మంది మృతి చెందారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో పది మంది; అనంతపురం జిల్లాలో ఎనిమిది మంది; కడప జిల్లాలో ఏడుగురు; చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు; విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు; కృష్ణా జిల్లాలో  ఒకరు చొప్పున మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,378కి చేరింది.

జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలివీ..

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని