ఏపీలో కరోనా: కొత్తగా 8,943 కేసులు - ap corona update
close
Published : 14/08/2020 18:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో కరోనా: కొత్తగా 8,943 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో(9AM-9AM)కొత్తగా 8,943 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,085కి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు 27,58,485 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒక్క రోజులో 53,026 నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 89,907యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,80,703 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లోనే మరో 9,779 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 97మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 2,475కి చేరింది.

కర్నూలు జిల్లాలో 12 మంది, చిత్తూరు; తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 10 మంది; అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు; విజయనగరం జిల్లాలో ముగ్గురు; కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనాతో మృతి చెందారు. 

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలివీ..

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని