కొవిడ్‌ కంటైన్మెంట్‌పై ఏపీ కీలక నిర్ణయాలు - ap govt key decisions on containment
close
Published : 27/04/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ కంటైన్మెంట్‌పై ఏపీ కీలక నిర్ణయాలు

అమరావతి: కొవిడ్‌ కంటైన్మెంట్‌ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ ఫోర్సు కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని, జేసీ (అభివృద్ధి)లకు కొవిడ్‌ కట్టడి చర్యలపై పూర్తి అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు. 104 కాల్‌ సెంటర్‌ నిర్వహణ, ఆస్పత్రుల్లో వసతుల పరిశీలించాలని సీఎం ఆదేశించారు. డేటా అప్‌డేషన్‌ సహా ఆస్పత్రుల మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను జేసీలకు అప్పగించారు. జిల్లాల్లో కొవిడ్‌ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలని, ప్రతి క్లస్టర్‌లో 5 నుంచి 8 ఆస్పత్రులు ఉండాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత రుసుం కంటే అధికంగా వసూలు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని