AP Corona: ఉపాధి హామీ సిబ్బందికి రూ.10 లక్షల పరిహారం - ap minister ramachandrareddy review meet
close
Published : 20/05/2021 21:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP Corona: ఉపాధి హామీ సిబ్బందికి రూ.10 లక్షల పరిహారం

అమరావతి: కరోనాతో చనిపోయిన ఉపాధిహామీ సిబ్బందికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా బారినపడి ఆర్థిక సమస్యలుంటే నెల జీతం అడ్వాన్స్‌గా చెల్లిస్తామన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీర్లతో మంత్రి ఇవాళ సమీక్ష నిర్వహించారు.ఈ భేటీలో 4 జిల్లాల ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూన్‌ నెలాఖరుకు 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలని, లక్ష్యం పూర్తయితే కేంద్రాన్ని అదనపు పనిదినాలు కోరవచ్చని వివరించారు. రహదారికి ఇరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. వర్షాకాలం వచ్చేలోపు జలశక్తి అభియాన్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఐదెకరాలలోపు రైతులకు బోరు ఉచితంగా వేసేలా పీడీలు చూడాలన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని