ఏపీ సచివాలయంలో మరో ఉద్యోగి మృతి - ap secretariat employee died with corona
close
Updated : 18/04/2021 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ సచివాలయంలో మరో ఉద్యోగి మృతి

అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతిచెందారు. సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జి.రవికాంత్‌  ఆదివారం ఉదయం కరోనాతో మృతి చెందారు. నిన్న ఆర్థిక శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పని చేసే వి.పద్మారావు కొవిడ్‌ సోకి కన్నుమూశారు. రెండ్రోజుల్లో ఇద్దరు ఉద్యోగులు కరోనాతో మృతి చెందడంతో సచివాలయం ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కారణంగా మరోసారి ‘వర్క్‌ ఫ్రం హోం’ ఇవ్వాల్సిందిగా ఉద్యోగులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. వివిధ విభాగాల్లో ఇప్పటికే 50 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో సచివాలయంలో పని చేసేవారికి ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. కొవిడ్‌ భయంతో ఉన్నతాధికారులు విజయవాడ, గుంటూరుల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని