కృష్ణవంశీ ‘అన్నం’.. రెహమాన్ సంగీతం‌..! - ar rahman to join with krishna vamsi
close
Published : 17/03/2021 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృష్ణవంశీ ‘అన్నం’.. రెహమాన్ సంగీతం‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖడ్గం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి సినిమాలతో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా కృష్ణవంశీ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇటీవల ‘అన్నం’ పేరుతో ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తీయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే.. అవి కేవలం పుకార్లంటూ కృష్ణవంశీ స్పష్టం చేశారు. కాగా.. ఈ సినిమాలో హీరో ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు. ఇవన్నీ ఇలా ఉండగా.. మరో ఆసక్తికరమైన వార్త ఇంటర్నెట్లో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు లెజెండరీ సంగీత దర్శకులు ఎఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లోనైనా నిజం ఉందో తెలియాలంటే కృష్ణవంశీ లేదా రెహమాన్‌ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌ వర్కౌట్‌ అయితే మాత్రం సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయనడంలో సందేహం అనవసరం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని