AR Rahman: లవ్‌స్టోరి టీమ్‌కి ఏఆర్‌ రెహమాన్‌ విషెస్‌ - ar rahman wishes to his student love story music director ch pawan
close
Published : 20/09/2021 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AR Rahman: లవ్‌స్టోరి టీమ్‌కి ఏఆర్‌ రెహమాన్‌ విషెస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో వెండితెరపై రాబోతున్న ‘లవ్‌స్టోరి’ చిత్రబృందానికి సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ సినిమాతో ఆయన శిష్యుడు పవన్‌ సీహెచ్‌ సంగీత దర్శకుడిగా పరిచయవుతున్నారు. ఈ సందర్భంగా ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ.. ‘‘ నీలో చాలా ప్రతిభ ఉంది పవన్‌. నువ్వు సక్సెస్‌తో ప్రజాభిమానం పొందాలని ఆశిస్తున్నా. నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు శేఖర్‌ కమ్ముల అందరికీ గుడ్‌లక్‌’’ అంటూ వీడియోని పంచుకున్నారు. లవ్‌స్టోరికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన విజయ్‌.సి.కుమార్‌ తనయుడే పవన్‌ సీహెచ్‌. ఒకే సినిమాకి తండ్రికొడుకులు కీలక బాధ్యతలు వహించడం అరుదుగా జరిగే విషయమంటూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్‌ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. మంగ్లీ పాడిన జానపద గీతం ‘సారంగదరియ’ 324 మిలియన్ల వ్యూస్‌ని దక్కించుకోగా..‘నీ చిత్రం చూసి’ పాట 31మిలియన్లు,  ‘ఏయ్‌పిల్లా’  23మిలియన్లతో ముందుకు కొనసాగుతుంది.

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని