Ariyana: వర్మతో మరో ఇంటర్వ్యూ టీజర్ ఇదే! - ariyana glory bold interview with rgv
close
Updated : 18/06/2021 22:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ariyana: వర్మతో మరో ఇంటర్వ్యూ టీజర్ ఇదే!

హైదరాబాద్: బిగ్‌బాస్ సీజ‌న్‌-4తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా యాంక‌ర్ అరియానా గ్లోరీ. తాజాగా ఆమెకు ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ సారీ చెప్పారు. గతంలో వ‌ర్మ‌తో చేసిన ఇంట‌ర్వ్యూతోనే అరియానా పాపులర్ అయ్యారు. ఆ ఇంట‌ర్వ్యూలో ఆర్జీవీ చేసిన సంచ‌ల‌న కామెంట్స్‌తో అరియానాపై అంద‌రి దృష్టి ప‌డింది.

ఇక ఆ తర్వాత ఆమె బిగ్‌బాస్‌తో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్జీవీని అరియానా సంచ‌ల‌న ఇంట‌ర్వ్యూ చేసింది. అరియానా, వర్మల జిమ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ రిలీజ్‌ ఆలస్యం కావడంతో వర్మ సారీ చెప్పారు. పూర్తి ఇంటర్వ్యూ జూన్ 19న అభిమానులతో వర్మ పంచుకోనున్నారు.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని