Ariyana Mix Rgv: ఈసారి నవ్వులే నవ్వులు - ariyana rgv interview ariyana mix rgv
close
Published : 30/06/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ariyana Mix Rgv: ఈసారి నవ్వులే నవ్వులు

ఇంటర్నెట్‌డెస్క్‌: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియానాతో కలిసి ఇటీవల చేసిన ఇంటర్వ్యూ సోషల్‌మీడియా వేదికగా బాగా ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. దీనిపై వివిధ రకాల స్పందనలు వచ్చాయి. ఆర్జీవీ సైతం పలు టెలివిజన్‌ ఛానళ్ల వేదికగా ఈ బోల్డ్‌ ఇంటర్వ్యూపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తాజాగా అదే ఇంటర్వ్యూకు కొన్ని మెరుపులు జోడించి ఆర్జీవీ మళ్లీ అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హాయ్‌! అరియానా నాతో చేసిన ఇంటర్వ్యూ ‘అరియానా బోల్డ్‌ ఆర్జీవీ’కి యూట్యూబ్‌లో మంచి స్పందన వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆ ఇంటర్వ్యూ చూసి, అసంతృప్తి చెందిన వారిని కూడా మేము ప్రేమిస్తాం. మాలాగా పరిపక్వత రావడానికి వారికి ఇంకా సమయం పడుతుంది. అప్పటిదాకా మేము వేచి చూస్తాం! రాకపోయినా పర్వాలేదనుకోండి. అదే వేరే విషయం. ‘సమాజం ఏమైపోతోంది?’ అంటూ నెగెటివ్‌గా కామెంట్‌ చేసేవారికి నేనొక చిన్న ఉచిత సలహా ఇస్తా. అప్పుడప్పుడు కొంచెం ‘చిల్‌’ అవటం నేర్చుకోండి. జీవితమంతా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్నింటినీ ఎంజాయ్‌ చేయడం నేర్చుకోండి. ఇదే నేనిచ్చే జ్ఞాన గుళిక. ఈ సందర్భంగా  ‘అరియానా మిక్స్‌ ఆర్జీవీ’ అని అదే ఇంటర్వ్యూకి కొన్ని మెరుపులు జోడించి ఇంకో వెర్షన్‌ తీసుకొస్తున్నాం. చూసి ఆనందించండి’’ అంటూ ఆ వీడియోను ఆర్జీవీ పంచుకున్నారు. పాత ఇంటర్వ్యూకు మీమ్స్‌ జోడించి విడుదల చేసిన వీడియో నవ్వులు పూయిస్తోంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని