‘ఎఫ్ 2’ హిందీ  రీమేక్‌లో అర్జున్‌ కపూర్‌? - arjun kapoor in f2 hindi remake
close
Published : 06/04/2021 05:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఎఫ్ 2’ హిందీ  రీమేక్‌లో అర్జున్‌ కపూర్‌?

ఇంటర్నెట్ డెస్క్: వెంకటేష్‌-వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌ అనేది ఉపశీర్షిక). అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించారు. 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికలుగా తమన్నా, మెహరీన్‌ నటించి అలరించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెలుగులో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’గా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ‘ఎఫ్‌2’ చిత్రానికి సంబంధించి హిందీ రీమేక్‌ని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి దిల్‌రాజు నిర్మించనున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. త్వరలోనే చిత్రాన్ని హిందీలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో వరుణ్‌ తేజ్‌ పాత్రలో బోనీ తనయుడు అర్జున్ కపూర్‌ను తీసుకున్నట్లు సమాచారం. వెంకటేష్‌ పాత్రలో ఎవరు నటిస్తారనేది దానిపై ఇంకా ఓ కొలిక్కి రాలేదట. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్‌ అనీష్‌ బజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కథానాయికలు ఎవరేనేది కూడా తెలియడం లేదు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని