పవన్‌ చిత్రంలో ఔరంగజేబుగా బాలీవుడ్‌ నటుడు - arjun rampal as aurangzeb in the movie pawan
close
Published : 16/02/2021 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ చిత్రంలో ఔరంగజేబుగా బాలీవుడ్‌ నటుడు

ఇంటర్నెట్‌ డెస్క్: పవన్ కల్యాణ్‌‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ చిత్రం చేస్తున్నారు. ‘PSPK 27’గా వ్యవహరిస్తున్న సినిమాకి ఏ.ఎం.రత్నం నిర్మాత. ఇందులో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు. చిత్ర షూటింగ్‌ని ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. 12రోజుల పాటు జరిగే ఈ షూటింగ్ షెడ్యూ‌ల్లో పవన్‌ - రాంపాల్‌లపై సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. అంతేకాదు సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా చార్మినార్‌, మచిలీపట్నం పోర్ట్ సెట్లను వేశారు. ఇందులోనే  చిత్రీకరణ జరగనుంది.

చిత్ర కథానాయికగా నిధి అగర్వాల్‌ నటిస్తోంది. తాజాగా పవన్‌ - నిధిలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. బాలీవుడ్‌ భామ జాక్విలీన్‌‌ ఫెర్నాండజ్‌ - అర్జున్‌ రాంపాల్‌ సోదరిగా నటిస్తోంది. సినిమాకి ఇప్పటికే ‘విరూపాక్ష’, ‘హరి హర వీరమల్లు’ లాంటి పేర్లును నిర్మాణ సంస్థ పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని