Arjun: వేడుకగా హనుమాన్‌ ఆలయ ప్రారంభోత్సవం - arjun sarja inaugurates hanuman temple
close
Updated : 07/07/2021 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Arjun: వేడుకగా హనుమాన్‌ ఆలయ ప్రారంభోత్సవం

చెన్నై: ‘ఒకే ఒక్కడు’ ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘పుట్టింటికి రా చెల్లి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు అర్జున్‌ సర్జా. ఆంజనేయస్వామికి పరమ భక్తుడైన ఆయన చెన్నైలో హనుమాన్‌ ఆలయాన్ని ఇటీవల నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఆలయ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

చెన్నై విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న తన సొంత స్థలంలో అర్జున్‌ ఈ ఆలయాన్ని నెలకొల్పారు. సుమారు 15 సంవత్సరాల క్రితమే ఈ మహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయంలో దాదాపు 35 అడుగుల ఎత్తైన హనుమాన్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని