హల్‌చల్ చేస్తున్న ‘అర్రెరెరె జాతిరత్నాలు’ - arrerere jathi ratnalu special song by ram miriyala
close
Published : 19/03/2021 22:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హల్‌చల్ చేస్తున్న ‘అర్రెరెరె జాతిరత్నాలు’

ఇంటర్నెట్‌డెస్క్: నవీన్‌ పొలిశెట్టి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘జాతి రత్నాలు’. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఫరీదా కథానాయికగా నటించింది. మార్చి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘అర్రెరె జాతిరత్నాలు’ అంటూ రామ్‌ మిర్యాల పాడిన ప్రత్యేక పాటను వైజయంతి నెట్‌వర్క్ సంస్థ తన యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. అందులో చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను వీడియోలో పంచుకున్నారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకి నాగ్‌ అశ్విన్‌ నిర్మాతగా వ్యవరించగా.. రథన్‌ సంగీతం స్వరాలు సమకూర్చారు. చిత్రంలో బ్రహ్మానందం, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, బ్రహ్మజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని