సీఎంలందరికీ  కేజ్రీవాల్‌ లేఖ!  - arvind kejriwal writes to all chief ministers asking for spare oxygen
close
Published : 24/04/2021 22:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎంలందరికీ  కేజ్రీవాల్‌ లేఖ! 

దిల్లీ: కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో దేశ రాజధాని నగరం ఆక్సిజన్‌ కొరతతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రాణవాయువును సమీకరించేందుకు కేజ్రీవాల్‌ సర్కార్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రులందరికీ  లేఖలు రాసినట్టు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఆయా రాష్ట్రాల వద్ద ఆక్సిజన్‌ ఉంటే.. దేశ రాజధాని నగరానికి పంపాలని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు సాయం చేస్తున్నప్పటికీ కరోనా తీవ్రత దృష్ట్యా అందుబాటులో ఉన్న వనరులు సరిపోవడంలేదని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 

దిల్లీలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే గతంలో ఎన్నడూ లేనంతగా 348 మంది కొవిడ్‌తో ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దిల్లీలో 90వేలకు పైనే క్రియాశీల కేసులు ఉండటంతో అక్కడి ఆరోగ్య వసతులపై తీవ్ర భారం పడింది. దీంతో పాటు మెడికల్‌ ఆక్సిజన్‌, ఔషధాలు, ఐసీయూ బెడ్‌ల కొరత నెలకొనడంతో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని