Pegasus: హ్యాకింగ్ జాబితాలో కేజ్రీవాల్ సన్నిహితుడి నంబర్.. - arvind kejriwals aide on snoop list
close
Published : 26/07/2021 23:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pegasus: హ్యాకింగ్ జాబితాలో కేజ్రీవాల్ సన్నిహితుడి నంబర్..

దిల్లీ ముఖ్యమంత్రిపై కూడా హ్యాకింగ్ ఎఫెక్ట్

దిల్లీ: పెగాసస్ స్పైవేర్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై పార్లమెంట్‌ దద్దరిల్లుతుండగా.. తాజాగా లీకైన ఫోన్‌ నంబర్ల జాబితాలో మరో కొత్తపేరు బయటకు వచ్చింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారి రాజేశ్వర్ సింగ్ ఫోన్‌ నంబర్ హ్యాకింగ్ టార్గెట్ జాబితాలో ఉన్నట్లు వెల్లడైంది. ఆయనతో పాటు ఆయన కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల నంబర్లు కూడా ఉన్నట్లు ఓ వార్త కథనం పేర్కొంది.

వీరే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీతో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ మాజీ అధికారి వీకే జైన్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కేజ్రీవాల్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. జైన్‌ను ‘పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా మార్క్‌ చేసినట్లు ఆ కథనం వెల్లడించింది. పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికి పైగా భారతీయులున్నట్లు ‘ది వైర్’ వార్తా సంస్థ కొద్దిరోజుల క్రితం ప్రచురించిన సంగతి తెలిసిందే. వారిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ సీఈసీ అశోక్ లావాసా ఫోన్ నంబర్లు హ్యాకింగ్ టార్గెట్ జాబితాలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఈ కథనాలను కేంద్రం కొట్టిపారేస్తోంది. భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే ఈ కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ దుయ్యబట్టింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని