‘పుష్ప’ ప్రతినాయకుడిగా ఆర్య..? - arya play key role in Allu Arjun Pushpa
close
Updated : 26/12/2020 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పుష్ప’ ప్రతినాయకుడిగా ఆర్య..?

హైదరాబాద్: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా స్థాయిలో, ఐదు భాషల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రష్మిక నాయిక. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ప్రతినాయకుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ, డేట్స్‌ అందుబాటులో లేకపోవడంతో నటుడు ఆర్యను ఎంపిక చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 2009లో అల్లు అర్జున్‌తో కలిసి ‘వరుడు’ చిత్రంలో ఆర్య ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరూ కలిసి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ సినిమాలతో బిజీగా ఉన్న ఆర్య పదేళ్ల తర్వాత తెలుగులో ఈ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వనుండటం గమనార్హం. ఈ విషయంపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆరుగురు సభ్యులకు కరోనా సోకటంతో చిత్రీకరణ వాయిదా పడిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప’లో నటిస్తున్న ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ఆర్య దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్న ‘సర్‌పట్టా పరమ్‌బరై’ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా శక్తి సౌందరాజన్ దర్శకత్వంలో ఆయన భార్య సాయేషాతో కలిసి నటించిన చిత్రం టెడ్డీ. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ప్రతినాయకుడిగా మరో చిత్రం చేయనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని