సెట్స్ పైకి వెళ్లనున్న ఆర్య - కుమారసామి చిత్రం! - arya to play lead in director nalan kumarasamys next film to go on floors soon
close
Published : 08/06/2021 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెట్స్ పైకి వెళ్లనున్న ఆర్య - కుమారసామి చిత్రం!

ఇంటర్నెట్‌ డెస్క్: ‘వరుడు’ చిత్రంలో అల్లు అర్జున్‌తో తలపడిన నటుడు ఆర్య. ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్‌గా నటించిన చిత్రం ‘సైజ్‌ జీరో’. ఇందులో అనుష్కతో కలిసి నటించి అలరించారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తమిళం నుంచి తెలుగులోకి అనువాదమై మెప్పించాయి. ప్రస్తుతం తమిళంలో ‘సార్‌పట్ట పరంబరై’లో బాక్సర్‌గా నటిస్తున్నారు. హీరో విశాల్‌ నటిస్తున్న ‘ఎనిమీ’ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాల తర్వాత ‘సూదు కవ్వం’ ఫేమ్‌ నలన్‌ కుమారసామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంగా తెరకెక్కునున్న ఈ సినిమాని గ్రీన్‌ స్టూడియో పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. చిత్రకథను నలన్‌ - ఆర్యకు గత ఏడాది చివరల్లోనే వినిపించారట. కథ విన్న ఆర్య గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చారట. ఇందులో ఆర్య సరికొత్త పాత్రలో కనిపించనున్నారట. ఇది అభిమానులకు చాలా బాగా నచ్చుతుందని చెప్పుకుంటున్నారు. లాక్‌డౌన్‌ పూర్తికాగానే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. నలన్‌ గత ఏడాదిలో వచ్చిన తమిళ భాషా రొమాంటిక్ ఆంథాలజీ చిత్రం ‘కుట్టి స్టోరీ’ సీరీస్‌లో ఒకటైన ‘ఆదల్‌ పాదల్’ లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతి, అదితి బాలన్ కీలక పాత్రల్లో నటించారు. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని