‘తలైవా.. వా’.. ఇది ఆ గ్రామం ఏళ్ల నిరీక్షణ! - as rajini gets phalke village awaits the return of the native
close
Published : 02/04/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘తలైవా.. వా’.. ఇది ఆ గ్రామం ఏళ్ల నిరీక్షణ!

పుణె: ‘తలైవా.. వా’ అంటూ మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామం ఏళ్లుగా ఎదురుచూస్తోది. సూపర్‌స్టార్‌ రజనీకి అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించిన నేపథ్యంలో ఆ గ్రామం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ రజనీ రాక కోసం ఆ గ్రామస్థులు అంతలా ఎందుకు ఎదురు చూస్తున్నారో తెలియాలంటే దీనిపై ఓ లుక్కేయండి.

పుణెకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది మావాడి కాటేఫాథర్. ఇది శివాజీ రావు గైక్వాడ్‌ (సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్‌ అసలు పేరు) పూర్వీకుల స్వస్థలం. ఉపాధి నిమిత్తం రజనీ తాత ఇక్కడి నుంచి వివిధ ప్రదేశాలకు వలస వెళ్లారు. తొలుత కర్ణాటకలోని విజయపుర తహసీల్‌లోని బసవన్న బాగేవాడిలో ఉన్న వీరు ఆ తర్వాత బెంగళూరుకు చేరారు. అక్కడే రజనీ జన్మించారని ఆ గ్రామంలోని ఓ వృద్ధుడు తెలిపారు. అయితే, ఇక్కడి నేలను విడిచి వెళ్లిన తమ గ్రామ బిడ్డ రాక కోసం ఈ గ్రామస్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇందులో భాగంగానే కొన్నేళ్ల కిందట మహారాష్ట్రలోని లోనావాలాలో సినిమా షూటింగ్‌కు వచ్చిన రజనీని ఇక్కడి కొంతమంది కలిశారు. తమ పూర్వీకుల స్వస్థలం మావాడికి రావాలని కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ తప్పక వస్తానని మాటిచ్చారని రజనీ కలిసిన గ్రామస్థుడు ఒకరు తెలిపారు. తొలుత హిందీలో పరిచయం చేసుకున్న తమను మరాఠీలో మాట్లాడాలని రజనీ కోరడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్‌స్టార్‌ తమ గ్రామానికి తప్పకుండా వస్తారని ఆయనతో పాటు గ్రామంలోని మరికొంత మంది ఆశాభావంతో ఉన్నారు.  

రజనీకి దాదా ఫాల్కే అవార్డు రావడం తమకు ఎంతో గర్వంగా ఉందని ఆ గ్రామ మాజీ సర్పంచి సదానంద్ జగ్తప్‌ పేర్కొన్నారు. ఎంతో బిజీగా ఉండే రజనీని అవసరమైతే మరోసారి కలిసి గ్రామానికి రావాలని ఆహ్వానిస్తామని మరో గ్రామస్థుడు ఆకాశ్‌ చాహర్‌ తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రతిష్ఠాత్మక అవార్డు మహారాష్ట్ర భూషణ్‌ను రజనీకి ఇవ్వాలని 2016లో ఇక్కడి భాజపా ఎమ్మెల్యే అనిల్‌ గొట్టే డిమాండ్‌ చేశారు. గైక్వాడ్‌ కుటుంబంలో జన్మించిన రజనీ.. అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమా రంగంలో అరుదైన గుర్తింపును సంపాదించుకున్నారని అనిల్‌ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని