Tollywood: ఇంటివాడైన నటుడు ఆశిష్‌ - ashish gandhi gets married
close
Published : 04/06/2021 19:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: ఇంటివాడైన నటుడు ఆశిష్‌

హైదరాబాద్‌: ‘నాటకం’ చిత్రంలో విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు ఆశిష్‌ గాంధీ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. నిఖిత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. కొవిడ్‌-19 నిబంధనల కారణంగా అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. కాగా, తాజాగా వీరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ‘నేను కోరుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తను నా వ్యక్తితగతమైన విషయాలను బాగా అర్థం చేసుకుంటుంది’ అని ఆశిష్‌ తెలిపారు. మరోవైపు ఆశిష్‌ ప్రస్తుతం ‘డైరెక్టర్‌’, ‘ఉనికి’తోపాటు మరో ప్రాజెక్ట్‌లో సైతం కథానాయకుడిగా నటిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని