తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది అదే: యాష్‌ - ashwin suggests parents to teach their children the importance of nature and its beauty
close
Published : 16/03/2021 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది అదే: యాష్‌

కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లిన అశ్విన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో అత్యద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతున్నాడు. కేరళలోని పారంబికులం పులుల సంరక్షణ కేంద్రానికి విహారయాత్రకు వెళ్లిన అతడు.. అందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మంగళవారం తన ఇన్‌స్టాలో ఒక కుమార్తెతో కలిసి దిగిన ఫొటోను పంచుకొని సంబరపడ్డాడు.

ఓ నీటి సరస్సు వద్ద సెల్ఫీ తీసుకొని అభిమానులతో పంచుకొని ఇలా రాసుకొచ్చాడు. ‘తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ప్రకృతి సౌందర్యం, దాని విశిష్టతను తెలియజేయండి. అదే మనం వారికిచ్చే అతిగొప్ప బహుమతి’ అని పేర్కొన్నాడు. మరోవైపు అశ్విన్‌ సతీమణి ప్రీతి సైతం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. దానికి ‘మాస్క్‌ అప్‌’ అని వ్యాఖ్యానించింది. అందులో ముగ్గురూ ఏనుగుల సమీపంలో నిల్చొని ఫొటోకు పోజిచ్చారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నెలకొన్న పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని ప్రీతి చెప్పకనే చెప్పింది.

ఇక ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో అశ్విన్‌ మొత్తం 32 వికెట్లు తీయడమే కాకుండా 189 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే చెన్నైలో ఒక సెంచరీ బాది టెస్టుల్లో ఏడోసారి ఆ ఘనత నమోదు చేశాడు. అలాగే అహ్మదాబాద్‌లో స్పిన్‌కు అనుకూలించే మొతేరా పిచ్‌పై వికెట్ల జాతర చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో 400 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్‌ 409 వికెట్లతో కొనసాగుతుండగా, అతడికన్నా ముందు హర్భజన్‌ 417, కపిల్‌దేవ్‌ 434, అనిల్‌కుంబ్లే 619 ఉన్నారు. త్వరలోనే ఈ చెన్నై స్పిన్నర్‌ హర్భజన్‌, కపిల్‌దేవ్‌ను అధిగమించే అవకాశం ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని