అశ్విన్‌దే ‘ఫిబ్రవరి’ - ashwin wins iccs february player of the month award for stellar show against england
close
Published : 09/03/2021 17:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అశ్విన్‌దే ‘ఫిబ్రవరి’

దుబాయ్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐసీసీ ఫిబ్రవరి నెలకు గాను మేటి ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసులో అద్భుత ప్రదర్శనకు అతడికీ పురస్కారం సొంతమైంది. ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ టామీ బ్యూమాంట్‌కు మహిళల విభాగంలో పురస్కారం దక్కింది.

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ శతకం (106)తో అదరగొట్టాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో 400వ వికెట్‌ సాధించాడు. మొత్తంగా ఇంగ్లాండ్‌ సిరీసులో 24 వికెట్లు పడగొట్టాడు. భారత్‌ 3-1 తేడాతో సిరీస్‌ గెలుచుకోవడం, ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరుకోవడంలో అతడు కీలకంగా నిలిచాడు.

జోరూట్‌ సేనతో టెస్టు సిరీసులో 176 పరుగులు, 24 వికెట్లు తీసిన అశ్విన్‌ పురుషుల విభాగంలో ఏకగ్రీవంగా ఫిబ్రవరి పురస్కారానికి ఎంపికయ్యాడని ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ (333 పరుగులు, 6 వికెట్లు), వెస్టిండీస్‌ అరంగేట్రం టెస్టు ఆటగాడు కైల్‌ మేయర్స్‌ పోటీకి నామినేట్‌ అయ్యారని తెలిపింది. బంగ్లాదేశ్‌తో టెస్టులో మేయర్స్‌ 210 పరుగులు సాధించి 395 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం అందించాడు.

‘కీలకమైన సిరీసులో అశ్విన్‌ నిలకడగా వికెట్లు తీస్తూ తన జట్టును ముందంజలో నిలిపాడు. ఇంగ్లాండ్‌ తిరిగి రెండో టెస్టుపై పట్టు బిగిస్తున్న సమయంలో అతడు శతకం సాధించాడు. ఇక న్యూజిలాండ్‌ సిరీసులో బ్యూమాంట్‌ మూడు అర్ధశతకాలు చేయడం అద్భుతం’ అని ఐసీసీ ఓటింగ్‌ అకాడమీ ప్రతినిధి ఇయాన్‌ బిషప్‌ తెలిపారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని