ఆ విషయం మీరు విజయ్‌ని అడగండి: రష్మిక - ask this question to vijay devarakonda says rashmika
close
Published : 28/04/2021 19:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ విషయం మీరు విజయ్‌ని అడగండి: రష్మిక

నెటిజన్లతో ముచ్చటించిన భామ

హైదరాబాద్‌: ‘గీతగోవిందం’తో స్టార్‌హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం ఈ భామ సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రష్మిక తాజాగా కొంత సమయంపాటు అభిమానులతో ముచ్చటించారు. ఆ సరదా విశేషాలు మీకోసం..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్‌ ఎంతో ఉద్ధృతంగా ఉంది. బయట పరిస్థతులు ఏం బాలేదు. అందరూ తప్పకుండా ఇళ్లలోనే ఉండండి. జనసమూహాలకు దూరంగా ఉండండి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా సరే కచ్చితంగా మాస్క్‌ ధరించండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.

ఇటీవల నా పుట్టినరోజు నాడు మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఆరోజు షూటింగ్‌లో బిజీగా ఉండడంతో  మీకు అందుబాటులో ఉండలేకపోయాను. అభిమానులందరూ కలిసి నాకు పంపించిన ఉంగరం నాకెంతో నచ్చింది. అది ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఇకపై ఆ ఉంగరం కూడా నాలో భాగమే. దానిని ఎప్పటికీ నా చేతి నుంచి తియ్యను.

మేడమ్‌ తెలుగులో మాట్లాడండి?

హాయ్‌. అందరూ బాగున్నారా. ఇంట్లోనే కుటుంబసభ్యులతో సమయాన్ని గడపండి. స్నేహితులను కలవకండి. రోజూ ఉదయాన్నే యోగా చేయండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి.

కొంచెం మరాఠీలో మాట్లాడండి

క్షమించండి నాకు మరాఠీ రాదు.

కొవిడ్‌ తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం వస్తుందని అనుకుంటున్నా?

తప్పకుండా. సెకండ్‌వేవ్‌ ఉద్ధృతి తగ్గి మనం కొంతవరకూ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టాక అందర్నీ కలుస్తాను.

మీకు మలయాళం తెలుసా?

అమ్మ బాబోయ్‌. నాకు తెలీదు. ఒకవేళ మలయాళంలో సినిమా చేయాల్సి వస్తే తప్పకుండా నేర్చుకుంటా.

మీ తదుపరి సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

ఏమో నాకు తెలీదు. పరిస్థితులు చక్కబడే వరకూ ఎదురుచూడాల్సిందే.

హాలీవుడ్‌కి వెళ్లే ఆలోచనలున్నాయా?

నో కామెంట్స్‌. ఒకవేళ నేను హాలీవుడ్‌కి వెళితే అప్పుడు తప్పకుండా మాట్లాడతా.

విజయ్‌దేవరకొండతో మరో సినిమా చేస్తారా?

ఈ ప్రశ్న మీరు విజయ్‌ని అడగండి. ఒకవేళ ఎవరైనా దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా కలిసి నటిస్తా.

మీరు బాగా పాడతారని విన్నాను. నిజమేనా?

నో. నేను డ్యాన్స్‌ చేయగలను కానీ పాడలేను.

‘పుష్ప’ షూటింగ్‌ అనుభవాలను పంచుకోగలరు?

‘పుష్ప’ షూట్‌ ఎంతో చక్కగా కొనసాగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎంతో అప్రమత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మీ అందరికీ ఆ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

మీ అభిమాన హీరో ఎవరు?

నో కామెంట్స్‌. ఇప్పుడు నేను ఆ పేర్లు చెప్పాలనుకోవడం లేదు.

మీ బాయ్‌ఫ్రెండ్‌ ఎవరు?

వర్క్‌.. నాకు ఇప్పుడు అలాంటి వాటికి సమయం లేదు.

మీ ఫేవరెట్‌ కన్నడ మూవీ ఏది?

కిర్రాక్‌పార్టీ

తెలుగు సినీ పరిశ్రమలో మీ ఫస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరు?

స్వప్నికా మేడమ్‌, వెంకీ

మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?

తెలంగాణలో ఉన్నాను. పుష్ప సినిమా షూట్‌లో పాల్గొంటున్నాను.

ఐపీఎల్‌లో మీకిష్టమైన టీమ్‌?

బెంగళూరు

మీకిష్టమైన ప్రదేశం?

కూర్గ్‌. మా సొంతూరు అదే.

కపిల్‌శర్మ షోలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నా?

సెకండ్‌వేవ్‌ ముగిసిపోయి సినిమాలు తిరిగి విడుదలైతే ప్రమోషన్స్‌ కోసం మేము ఆ షోకి రావొచ్చు.

మీకిష్టమైన కారు?

నేను వాడుతున్న కారు.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని