Akshay kumar: ‘గూర్ఖా’గా రాబోతున్న అక్షయ్‌ కుమార్‌ - askahy kumar new movies first look
close
Published : 16/10/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akshay kumar: ‘గూర్ఖా’గా రాబోతున్న అక్షయ్‌ కుమార్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్‌ దూకుడు మీద ఉన్నారు. వరుసపెట్టి సినిమాలను చేస్తున్నారు. తాజాగా ఆయన చేయబోయే సినిమాల జాబితాలో మరో సినిమా వచ్చి చేరింది. సంజయ్‌ పురాన్‌ సింగ్‌ దర్శకత్వంలో ‘గూర్ఖా’ అనే చిత్రంలో అక్షయ్‌ నటించబోతున్నారు. ఈ మేరకు తన ‘గూర్ఖా’ ఫస్ట్‌లుక్‌ను అక్షయ్‌కుమార్‌ సోషల్‌మీడియాలో విడుదల చేశారు. ‘‘కొన్ని కథలు మనమే చేయాలనేంత స్ఫూర్తిని కలిగిస్తాయి. లెజెండరీ వార్‌ హీరో మేజర్‌ ఇయాన్‌ కార్డొజో జీవితం ఆధారంగా తీయనున్న ‘గూర్ఖా’ చిత్రం కూడా అలాంటిదే. ఆయన పాత్రలో నటించడాన్ని గొప్పగా భావిస్తున్నా’’అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆనంద్‌. ఎల్‌.రాయ్‌, హిమాన్షు శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

‘‘1971 ఇండో-పాకిస్థాన్‌ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన మేజర్‌ జనరల్‌ ఇయాన్‌ కార్డొజో పేరు చరిత్రలో మరుగునపడిపోయింది. ఆ యుద్ధవీరుడి జీవితాన్ని సినిమాగా తీస్తున్నందుకు గర్వంగా ఉంది. అక్షయ్‌కుమార్‌తో మూడో సారి పని చేసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నా’’అని ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఆనంద్‌. ఎల్‌. రాయ్‌ అన్నారు. అక్షయ్‌ నటిస్తోన్న ఆత్రంగి రే, రక్షా బంధన్‌ చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.  గూర్ఖా.. చిత్రం మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని మరో నిర్మాత హిమాన్షు శర్మ తెలిపారు. 

తన జీవితం ఆధారంగా సినిమా రాబోతున్న నేపథ్యంలో మేజర్‌ జనరల్‌ ఇయాన్‌ కార్డొజో స్పందించారు. ‘‘1971 ఇండో-పాక్‌ యుద్ధానికి 50 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం అప్పటి యుద్ధంలో భారత సైన్యం వీరోచిత పోరాటాలు, త్యాగాలను స్మరించుకునేలా చేస్తుంది. ఈ కథ భారత సైన్యంలోని ప్రతి సైన్యాధికారి విలువలు, స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. అక్షయ్‌, ఆనంద్‌తో కలిసి కొత్త ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా’’అని చెప్పారు. 

అక్షయ్‌ కుమార్‌ సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన సూర్యవంశీ చిత్రం నవంబర్‌ 5న విడుదల కాబోతుంది. ఆనంద్‌.ఎల్‌.రాయ్‌ రెండు చిత్రాలతోపాటు పృథ్వీరాజ్‌, బచ్చన్‌ పాండే, రామ్‌సేథూ సినిమాల్లో అక్షయ్‌ నటిస్తున్నారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని