Nusrat Jahan: ఆమె సొమ్ము వాడుకోలేదు - asked nusrat jahan to register marriage but she avoided says nikhil jain
close
Published : 12/06/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nusrat Jahan: ఆమె సొమ్ము వాడుకోలేదు

ఆరోపణలపై పెదవివిప్పిన నిఖిల్‌ జైన్‌

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, బెంగాల్‌ నటి నుస్రత్‌ జహాన్‌ వివాహం గురించి గత కొన్నిరోజులుగా జరుగుతున్న వివాదంపై ఆమె భర్త నిఖిల్‌ జైన్‌ స్పందించారు. నిఖిల్‌తో తనకు చట్టప్రకారం పెళ్లి జరగలేదని.. కాబట్టి తమది కేవలం సహజీవనమేనని నుస్రత్‌ ఇటీవల వెల్లడించిన విషయం విదితమే. నిఖిల్ తన ఆస్తులు, డబ్బును దుర్వినియోగం చేశారంటూ ఆమె ఆరోపణలు కూడా చేసింది. కాగా, ఆమె చేసిన ఆరోపణల గురించి నిఖిల్‌ తాజాగా పెదవి విప్పారు.

‘2019లో మేమిద్దరం ప్రేమ వివాహం చేసుకున్నాం. టర్కీలో మా పెళ్లి వేడుకగా జరిగింది. అనంతరం కోల్‌కతాలో వివాహవిందు కూడా ఏర్పాటు చేశాం. ఒక భర్తగా ప్రతి విషయంలో తనకి అండగా ఉండేవాడిని. కొంతకాలం పాటు మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. గతేడాది ఆగస్టులో నుస్రత్‌ ఓ సినిమాలో నటించింది. ఆ సినిమా చిత్రీకరణ సమయం నుంచి తన ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది. అదే ఏడాది నవంబర్‌ 5న నుస్రత్‌ మా ఫ్లాట్‌ నుంచి తన వస్తువులన్నింటినీ తీసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నా వద్ద ఆమె వస్తువులేమీ లేవు. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడే.. మా వివాహాన్ని భారత్‌లోనూ రిజిస్టర్‌ చేయించమని ఆమెను ఎన్నోసార్లు అడిగాను. నా మాటలకు ఆమె  నుంచి ఏవిధమైనా సమాధానం వచ్చేది కాదు. పెళ్లైన వెంటనే.. నుస్రత్‌ ఇంటి లోన్‌ డబ్బుని కూడా నేనే చెల్లించాను. అది ఒక్కటే కాదు చాలాసార్లు డబ్బు కావాల్సి వచ్చిన్నప్పుడు తనకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తుండేవాడిని. డబ్బు విషయంలో తను చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి’ అని నిఖిల్‌ స్పందించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని