Lovlina's Olympics semifinal: లవ్లీనా మ్యాచ్‌ కోసం అసెంబ్లీ సమావేశాలు 30 నిమిషాలు వాయిదా..! - assam assembly likely to be adjourned for 30 minutes during lovlinas olympics semifinal on wednesday
close
Updated : 04/08/2021 05:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lovlina's Olympics semifinal: లవ్లీనా మ్యాచ్‌ కోసం అసెంబ్లీ సమావేశాలు 30 నిమిషాలు వాయిదా..!

గువాహటి: టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ విభాగంలో దూసుకుపోతున్న లవ్లీనా బొర్గొహైన్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను అస్సాం ప్రభుత్వం 30 నిమిషాలపాటు వాయిదా వేసే అవకాశం ఉంది. లవ్లీనా బుధవారం టర్కీకి చెందిన ప్రపంచ ఛాంపియన్‌ బుసెనాజ్‌ సుర్మెనెలితో తలపడనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాలను ఉదయం 11 గంటల నుంచి 30 నిమిషాలపాటు వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు స్పీకర్‌కు ప్రతిపాదనలు పంపినట్టు డిప్యూటీ స్పీకర్‌ డాక్టర్‌ నుముల్‌ మొమిన్‌ సూచనప్రాయంగా తెలిపారు. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు.

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌ విభాగంలో బరిలో దిగిన భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌.. 69 కిలోల విభాగంలో సత్తా చాటింది. క్వార్టర్స్ పోరులో చైనీస్‌ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. బుధవారం జరగబోయే కీలక మ్యాచ్‌లో గెలిస్తే ఆమె ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడినా ఆమెకు కాంస్యం దక్కుతుంది. లవ్లీనా కంటే ముందు విజేందర్‌ సింగ్‌, మేరీ కోమ్‌లు మాత్రమే బాక్సింగ్‌లో భారత్‌కు పతకాలు సాధించిపెట్టారు. 

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని