Covid: ఆస్తమా ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి - asthma patients during corona time
close
Updated : 12/05/2021 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid: ఆస్తమా ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ఇన్‌ఫెక్షన్‌లో జలుబు, జ్వరం, దగ్గుతో పాటు ఆయాసం కూడా లక్షణాలుగా ఉండటంతో ఆస్తమా పేషెంట్లు కంగారు పడుతున్నారు. కొద్దిపాటి ఆయాసం రాగానే కరోనా సోకిందేమోనని అనుమానపడుతున్నారు. వాతావరణాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితులు మారిపోయే ఆస్తమా బాధితులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా ఉన్నవాళ్లకు కరోనా సోకితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

ఇలాంటి సమయంలో ఆస్తమా బాధితులు భౌతిక దూరం తప్పక పాటించాలి. ఇంట్లో తగినంత వెచ్చదనం ఉండేలా చూసుకోవాలి. దుమ్ము, ధూళి, కాలుష్యాలకు దూరంగా ఉండాలి. కాసేపు నడవటం, ఈత కొట్టడం, యోగా, శ్వాస సంబంధ వ్యాయామాలు వంటివి చేయాలి. అవసరమైతేనే ఆసుపత్రికి వెళ్లాలి. ఇన్‌హేలర్‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. చల్లని పదార్థాలకు, చల్లని వాతావరణానికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఒకరి ఇన్‌హేలర్‌ మరొకరు వాడకూడదు. ఆస్తమా బాధితులు ఈ ప్రాథమిక జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. 

ఆస్తమా పేషెంట్లు వాడే ఇన్‌హేలర్స్‌ రెండు రకాలు ఉంటాయి. డ్రైపౌడర్‌ ఇన్‌హేలర్స్‌, మీటర్‌ డోస్‌ ఇన్‌హేలర్స్‌. వీటిల్లో మీటర్‌ డోస్‌ ఇన్‌హేలర్స్‌ వాడేటపుడు తప్పని సరిగా స్పేసర్‌ను ఉపయోగించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నెబులైజర్స్‌ వాడటం వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది. అందువల్ల అవసమైతే తప్ప నెబులైజర్స్‌ జోలికి పోకూడదు. పీల్చే మందులు వాడినా పరిస్థితి మెరుగుపడకపోతే వైద్యుల సలహా మేరకు ట్యాబ్లెట్లు వాడాలి. వీటితో పాటు ఎప్పటి కప్పుడు వైద్యుల సలహా తీసుకుంటూ ఉండాలి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని