లోయలో పడిన ట్రక్కు.. 10 మంది మృతి  - at least 10 killed over 30 hurt as truck falls into gorge in etawah
close
Published : 11/04/2021 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లోయలో పడిన ట్రక్కు.. 10 మంది మృతి 

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటావా జిల్లా పరిధిలో ఓ ట్రక్కు లోయలో పడిపోవటంతో 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనలో మరో 30 నుంచి 35 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. బర్హపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రవెనే ప్రాంతంలో డ్రైవర్‌ ఆ ట్రక్కుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అదనపు ఎస్పీ ప్రశాంత్‌ కుమార్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్రమాదం సమయంలో ఈ ట్రక్కులో 40 నుంచి 50 మంది ఉన్నట్టు తెలిపారు. మృతులంతా పురుషులే అని చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని