హైదరాబాద్: ‘‘ఆడుతూ వెళ్తే వెయ్యి ఎత్తులు.. వెతుకుతూ వెళ్తే వెయ్యి సమాధానాలు.. కానీ, ఒక జవాబు నిన్నే వెతక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు అడగాల్సింది.. సరైన ప్రశ్న’’ అంటున్నారు రోహిత్‌శెట్టి. ఆయన కథానాయకుడిగా వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘అతడే శ్రీమన్నారాయణ’. సచిన్ రవి దర్శకుడు. శాన్వి శ్రీవాత్సవ కథానాయిక. 2019లో విడుదలైన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో థియేటర్లో అలరించిన ఈ చిత్రం తెలుగులో టెలివిజన్‌లో కానీ, ఓటీటీలో కానీ అందుబాటులోకి రాలేదు.
ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కథ, కథనాలు ఉత్కంఠగా సాగుతాయి. కథానాయకుడు రక్షిత్‌శెట్టి ఓ వైపు హాస్యం పంచుతూనే యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. నిధి వేట నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. ‘‘జెంటిల్మెన్.. రేపు మీ గురించి చరిత్రలో ఎవరైనా రాస్తే అందులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మీరు అతన్ని కలవడానికి ముందు.. రెండు మీరు అతన్ని కలిసిన తర్వాత.. అతడే శ్రీమన్నారాయణ’’ అంటూ చివరిలో రక్షిత్‌శెట్టి డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
-
సందడి చేస్తోన్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
-
‘మహా సముద్రం’లో శర్వానంద్ ఇలా..!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
గుసగుసలు
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని