రికీ పాంటింగ్‌ టీమ్‌నే అధిగమించారు   - australian womens team break world record of ricky pontings odi consecutive wins
close
Published : 04/04/2021 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రికీ పాంటింగ్‌ టీమ్‌నే అధిగమించారు 

ఆస్ట్రేలియా మహిళా జట్టు సరికొత్త రికార్డు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా 22వ మ్యాచ్‌ గెలుపొందింది. ఈ క్రమంలోనే 2003 నాటి రికీపాంటింగ్‌ టీమ్‌ రికార్డును బద్దలుకొట్టింది. పాంటింగ్‌ సేన అప్పట్లో వరుసగా 21 వన్డేలు వరుసగా విజయం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ జట్టు 212 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ లారెన్‌ డౌన్‌(90; 134 బంతుల్లో 8x4) ఒంటరి పోరాటం చేసింది. మరోవైపు నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆపై బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 38.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అలిస్సా హేలీ(65; 68 బంతుల్లో 7x4, 2x6), ఎలిసి పెర్రి(56*; 79 బంతుల్లో 7x4), ఆష్‌లీ గార్డ్‌నర్‌(53*; 41 బంతుల్లో 3x4, 3x6) తలా ఓ చేయి వేయడంతో సునాయాస విజయం సాధించింది. కాగా, 2018 మార్చి 12 నుంచి ఇప్పటివరకు మొత్తం 22 వన్డేల్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు విజయం సాధించింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ నేతృత్వంలో ఓటమే ఎరుగకుండా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే రికీపాంటింగ్‌ టీమ్‌ రికార్డును బద్దలుకొట్టింది. 

అన్నీ క్లీన్‌స్వీప్లే..

* భారత్‌పై 3-0

* పాకిస్థాన్‌పై 3-0

* న్యూజిలాండ్‌పై 3-0

* ఇంగ్లాండ్‌పై 3-0

* వెస్టిండీస్‌పై 3-0

* శ్రీలంకపై 3-0

* న్యూజిలాండ్‌పై 3-0

* న్యూజిలాండ్‌పై 1-0
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని